మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా సారంగదరియా

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా సారంగదరియా

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’.  ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను హీరో రాజ్ తరుణ్‌‌‌‌ రిలీజ్ చేసి టీమ్‌‌‌‌కి ఆల్ ద బెస్ట్ చెప్పాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లా డుతూ ‘ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగే ఘర్షణలను ఇందులో చూపిస్తున్నాం’ అన్నాడు. 

షూటింగ్ పూర్తి చేసి, త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు నిర్మాతలు.  శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ , కాదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, హర్షవర్ధన్  తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.