సినీ హీరో రాజశేఖర్ కు ప్రమాదం తప్పింది. శంషాబాద్ పెద్ద గోల్కొండ వద్ద ఓఆర్ ఆర్ పై ఆయన కారు ప్రమాదానికి గురైంది. కారు టైరు పేలడంతో మూడు పల్టీలు కొట్టింది. అయితే వెంటనే కారులోని ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పింది. రాజశేఖర్ తో పాలు మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అక్కడి నుంచి రాజశేఖర్ వేరే కారులో వెళ్లాడు. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో రాజశేఖర్ కారు 180 స్పీడ్ ఉందని సమాచారం.
