సాయి ధరమ్ తేజ్కు సర్జరీ.. మరో ఆరునెలలు సినిమాలకు దూరం

సాయి ధరమ్ తేజ్కు సర్జరీ.. మరో ఆరునెలలు సినిమాలకు దూరం

మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai dharam tej) మరోసారి సినిమాలకు దూరం కానున్నారు. ఒక సర్జరీ నిమిత్తం ఆయన దాదాపు ఆరు నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో(Bro). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan kalyan) మరో కీ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో భాగంగా తాజాగా ఓక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు హీరో సాయి ధరమ్ తేజ్. ఇక ఈ ఇంటర్వ్యూలో యాంకర్.. బ్రో సినిమా సాంగ్స్ లో మీరు చేసిన డాన్స్ లు అంత సాటిస్ఫైగా లేదని అందరు అనుకంటున్నారు దానిపై మీరేమంటారు అని అడిగారు. దానికి సమాధానంగా సాయి ధరమ్ మాట్లాడుతూ.. ఆడియన్స్ కు కాదు నేను చేసిన డాన్స్ నాకే నచ్చలేదు. కానీ నాకు వీలైనంతమట్టుకు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను. ప్రస్తుతం నాకున్న ఫిజికల్ ప్రాబ్లమ్ వల్ల నేను ఎంత చేయగలనో అంత చేశాను. కానీ నా నెక్స్ట్ సినిమాకు మాత్రం ఇలా ఉండదు. ముందు ఎలా చేసేవాన్నో దానికి డబుల్ చేస్తాను ప్రామిస్ అని చెప్పుకొచ్చారు సాయి తేజ్. 

అంతేకాదు.. ఇందుకోసం సర్జరీ కూడా చేయించుకుంటున్నానని, దానికి మినిమమ్ ఆరు నెలల సమయం పడుతుందని, ఈ ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు కూడా తెలిపారు సాయి ధరమ్ తేజ్. ఈ న్యూస్ తెలుసుకున్న మెగా ఫ్యాన్స్.. సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.