సంపూ నవ్వుల ఫ్లేవర్

సంపూ నవ్వుల ఫ్లేవర్

తన మార్క్​ వినోదంతో మెప్పించే సంపూర్ణేష్ బాబు ఈసారి ‘క్యాలీఫ్లవర్’ సినిమాతో వస్తున్నాడు. ఆర్కే మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు.  ఈ నెల 26న సినిమా విడుదల కానుంది. నిన్న టీజర్‌‌‌‌ని లాంచ్ చేశారు. ‘ప్రతి మగాడూ తన శీలాన్ని కాపాడుకుంటే సమాజంలో రేప్స్ అనేవే జరగవనేది కాన్సెప్ట్. డబుల్ రోల్ చేశాను. ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలూ ఉన్న ఎంటర్‌‌‌‌టైనర్’ అని చెప్పాడు సంపూ. డైరెక్టర్ మాట్లాడుతూ ‘అన్‌‌లిమిటెడ్ ఎంటర్‌‌‌‌టైన్మెంట్ ఉన్న సినిమా. ప్రతి ఒక్కరూ నవ్వుతూ థియేటర్‌‌‌‌ నుంచి బయటికొస్తారు’ అని చెప్పారు. ‘నవ్వుల ఫ్లేవర్.. ఈ క్యాలీఫ్లవర్. సంపూ మాత్రమే చేయగలిగిన సినిమా’ అని నిర్మాత చెప్పారు. హీరోయిన్ వాసంతి, సమర్పకులు శ్రీధర్ గూడూరు, లిరిక్ రైటర్ పూర్ణాచారి, సంగీత దర్శకుడు ప్రజ్వల్ కూడా పాల్గొన్నారు.