‘టక్కర్’ రిలీజ్ వాయిదా

‘టక్కర్’ రిలీజ్ వాయిదా

సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘టక్కర్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే టీజర్‌‌, రెండు సాంగ్స్‌‌తో ఇంప్రెస్ చేసిన టీమ్.. ఈ నెల 26న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ డేట్‌‌ను వాయిదా వేస్తూ శుక్రవారం కొత్త రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు.

జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో లవ్ సీన్స్‌‌తో పాటు అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయంటున్నారు మేకర్స్. సిద్ధార్థ్ కెరీర్‌‌‌‌లో మరో గుర్తుండిపోయే సినిమా అవుతుందన్నారు. అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు.