
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట లీడ్ రోల్స్‌లో శౌరి చంద్రశేఖర్ రమేష్ రూపొందించిన చిత్రం ‘బుట్టబొమ్మ’ శనివారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘సితార సంస్థ నాకు హోమ్ బ్యానర్ లాంటిది. వాళ్ళ సినిమా అంటే నా సినిమా లాంటిదే. ‘బుట్టబొమ్మ’లో కథే హీరో. ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, అంతే వైల్డ్‌గా ఉంటుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు. దర్శకులు మారుతి, సంపత్ నంది, శైలేశ్ కొలను, అనుదీప్ సినిమా సక్సెస్ సాధించాలని విష్ చేశారు. ఈ చిత్రంతో తమకు మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందన్నారు నటీనటులు. దర్శకుడు రమేష్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.