శ్రీవిష్ణు, నయన్ సారిక జంటగా యదునాథ్ మారుతీరావు తెరకెక్కించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు నిర్మించారు. ఈనెల 28న సినిమా విడుదల కానుంది. బుధవారం టీజర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘ఇదొక సెలబ్రేషన్ లాంటి సినిమా. ఫస్ట్ హాఫ్ యూత్‌కు ఎక్కువగా నచ్చితే, సెకెండాఫ్ ఫ్యామిలీస్‌కు నచ్చుతుంది. చివరి పదిహేను నిమిషాలు అందరికీ నచ్చుతుంది.
ఒంగోలు నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో చాలా కొత్త పదాలు వింటారు. ఇప్పటివరకూ చూసిన వాళ్లంతా డైలాగ్స్‌కి విపరీతంగా నవ్వుతున్నారు. స్ట్రెస్ బస్టర్ లాంటి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నా” అని చెప్పాడు. హీరోయిన్ నయన్ సారిక మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు.
చాలా మలుపులు ఉన్నాయి. సిచువేషనల్ కామెడీ అదిరిపోతుంది. టీజర్ ఎంత ఎంటర్‌టైనింగ్‌గా ఉందో సినిమాలోనూ అంత ఎంటర్‌టైన్మెంట్ ఉంటుంది’ అని చెప్పింది. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు ఆశించే అన్నిరకాల అంశాలు ఇందులో ఉన్నాయని దర్శకుడు యదునాథ్ మారుతీ రావు చెప్పాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీతో ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసే సినిమా అని నిర్మాత సుమంత్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రధన్ సహా టీమ్ అంతా పాల్గొన్నారు.
