జటాధర అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా

జటాధర అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా

సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌‌లో వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ తెరకెక్కించిన సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘జటాధర’. జీ స్టూడియోస్ సమర్పణలో ప్రేరణ అరోరా నిర్మించారు.  నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో సినిమా విడుదలవుతున్న సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ ‘ఒకప్పుడు ధనాన్ని భూమిలో పాతిపెట్టి, దానికి ఒక పిశాచిని కాపలాగా పెట్టేవారని జానపద కథల్లో విని ఉంటాం. అలాంటి కథను ప్రజంట్‌‌ టైమ్‌‌లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందనేది మెయిన్ కాన్సెప్ట్‌‌.  ఘోస్ట్ హంటింగ్, ఫ్యామిలీ ఎమోషన్, శివుడి కథలతో చాలా లేయర్స్ ఉన్నాయి. 

ముఖ్యంగా ఇందులోని ప్లాష్‌‌ బ్యాక్‌‌ సీన్స్‌‌ నన్ను చాలా ఎక్సైట్‌‌ చేశాయి. నేను ఇందులో ఘోస్ట్‌‌ హంటర్‌‌‌‌గా కనిపిస్తా.  ధనపిశాచిగా సోనాక్షి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. శోభ అనే పాత్రలో  శిల్పా శిరోద్కర్ కనిపిస్తారు. యాక్షన్, ఫ్యామిలీ, మైథాలజీ లాంటి అన్ని ఎమోషన్స్ కుదిరిన సినిమా ఇది.  ఎక్కడ బోర్ కొట్టని నరేషన్‌‌తో చాలా ఆసక్తికరంగా ఉంటుంది.  ప్రేక్షకులు చాలా థ్రిల్ అవుతారు.   ఏ, బి, సి సెంటర్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చే సినిమా.  

‘ఎస్ఎంఎస్’లో నటించిన రోజున 20 సినిమాలు చేస్తాను అనుకోలేదు. అందుకే ఈ జర్నీ నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి సినిమాలకు హండ్రెండ్ పర్సెంట్‌‌ ఎఫర్ట్ పెడతాను, కష్టపడతాను. అలా చూసుకుంటే ఐ డిజర్వ్ మచ్ మోర్ అనిపిస్తుంది. త్వరలో రాహుల్ రవీంద్రన్ తో ఒక సినిమా ఉంది.  అలాంటి కాన్సెప్ట్‌‌ వరల్డ్‌‌ ఇంతవరకూ సినిమాల్లో రాలేదు” అని చెప్పారు.