Oh Bhama Ayyo Rama: సుహాస్ ఓ భామ అయ్యో రామ..ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీ ఎంట్రీ 

Oh Bhama Ayyo Rama: సుహాస్ ఓ భామ అయ్యో రామ..ఉదయ్ కిరణ్ హీరోయిన్ రీ ఎంట్రీ 

కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫొటో, రైటర్ పద్మభూషణ్‌‌‌‌‌‌‌‌ చిత్రాలతో హీరోగా మెప్పించిన సుహాస్(Suhas).. రీసెంట్గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ తో మరో హిట్ కొట్టాడు. ఇక ఇదే ఊపులో వరుస సినిమాలు లైన్ లో పెట్టేసాడు.

ప్రస్తుతం శ్రీరంగనీతులు, ప్రసన్నవదనం వంటి సినిమాలు చేస్తున్నాడు. నెల వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఇవి సెట్స్పై ఉండగానే సుహాస్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ఉప్పు కప్పురంబు అనే సినిమా కూడా రానుంది. ఈ సినిమాను దర్శకుడు ఐవీ శశి తెరకెక్కిస్తున్నాడు. 

లేటెస్ట్గా సుహాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘ఓ భామ అయ్యో రామ’(O Bhama Ayyo Rama) అనే టైటిల్తో మరో సినిమాను షురూ చేశాడు. ఇవాళ ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమం హైదరాబాదులో ఘనంగా జరిగింది. నిర్మాత దిల్ రాజు మొదటి క్లాప్ కొట్టాడు.ఈ సినిమాలో హీరో సుహాస్ కు జోడీగా తమిళంలో జో మూవీలో నటించిన హీరోయిన్ మాళవిక మనోజ్ నటిస్తుంది.

Also Read: ఇదేమీ అర్జున్ రెడ్డిలాగా ఉండదు..ఈ పాత్ర మనందరిది: విజయ్ దేవరకొండ

అంతేకాదు..ఈ సినిమాలో ఉదయ్ కిరణ్ నువ్వు నేను ఫేమ్ అనిత కీ రోల్లో కనిపించబోతుంది.రామ్ గోదాల డైరెక్ట్ చేయబోయే ఈ సినిమా షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుంది.రధన్ సంగీతం అందించనున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుహాస్ కి మంచి సక్సెస్ రావాలని ఆయన ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే..సుహాస్ నటించబోయే ప్రతి సినిమాలో నటనకు స్కోప్ ఉండే పాత్రలు ఎంచుకోవడం విశేషం.