The Family Star: ఇదేమీ అర్జున్ రెడ్డిలాగా ఉండదు..ఈ పాత్ర మనందరిది: విజయ్ దేవరకొండ

The Family Star: ఇదేమీ అర్జున్ రెడ్డిలాగా ఉండదు..ఈ పాత్ర మనందరిది: విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చాలా కాలంగా సరైన హిట్టుకోసం ఎదురుచూస్తున్నాడు. అప్పుడెప్పుడో వచ్చిన గీత గోవిందం(GithaGovindam) సినిమా తరువాత ఇప్పటివరకు సరైన హిట్టు లేదు విజయ్ దేవరకొండకి. చాలా ఆశలు పెట్టుకున్న ఖుషీ కూడా సో సో రిజల్ట్ నే ఇచ్చింది. దాంతో.. విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు పరశురామ్ కి మరో ఛాన్స్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.

గీత గోవిందం కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.దీంతో మేకర్స్ వరుస ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఇక రీసెంట్ ప్రమోషన్స్ లో భాగంగా ఫ్యామిలీ స్టార్ గురించి విజయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.   

"ఇది చాలా గొప్ప స్టోరీ అని..దర్శకుడు కథ చెప్తుంటేనే తెలిసిపోయింది. ఇందులో చేసిన క్యారెక్టర్ నా టీనేజ్, యవ్వన దశలు గుర్తుకొచ్చాయి. అలాగే నా సినిమా కెరీర్ చూసుకుంటే..మొదట్లో అదృష్టం కొద్దీ మంచి క్యారెక్టర్స్ తో కూడిన కథలు వచ్చాయి.ఆ క్యారెక్టర్ ను ఆడియన్స్ కూడా చాలా రోజుల వరకూ గుర్తుంచుకున్నారు. అలా సందీప్ రెడ్డితో చేసిన అర్జున్ రెడ్డి అలాంటిదే. ఇక ఫ్యామిలీ స్టార్ లో నేను పోషించిన పాత్ర కూడా నాకు అలాంటి మరో బ్లెస్సింగ్ అని చెప్పగలను..కానీ, ఇదేమీ అర్జున్ రెడ్డిలాగా ఉండదు. పూర్తిగా డిఫరెంట్ ఫిల్మ్. అర్జున్ రెడ్డితో దీనికి మధ్య ఎలాంటి పోలిక లేదని విజయ్ ఈ సందర్బంగా వెల్లడించాడు.ఫ్యామిలీ స్టార్ లో నా పాత్ర మనందరి ఎక్స్‌ట్రీమ్ వెర్షన్.

ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, ట్రైలర్ లో విజయ్ లుక్, తెలంగాణ స్లాంగ్లో వచ్చే డైలాగ్స్ ఎంతో అట్రాక్షన్ గా ఉన్నాయి. మధ్య తరగతి కుర్రాడిలా..పక్కింటి అబ్బాయిలా ఆకట్టుకుంటున్నాడు. "ఉల్లిపాయలు కొంటె ఆడు మనిషి కాదా..పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా.. డైలాగ్ తో పాటు ఏవండి..కాలేజ్‍కు వెళ్లాలి..కొంచెం దించేస్తారా” అని మృణాల్ ఠాకూర్ అంటే..'ఓ లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా' అని విజయ్ చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 

పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతగోవిందం సినిమా వచ్చి సూపర్ హిట్ ఐన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరో పదేళ్లు తమ ఫ్యాన్స్ మాట్లాడుకునేలా ఫ్యామిలీ స్టార్ ను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాతో విజయ్ హిట్ కొడితేనే..సినిమా కెరీర్ కు ప్రాణం పోసినంత హెల్ప్ అవుతుంది. మరి ఎలాంటి హిట్ అందుకుంటారో చూడాలి.

  • Beta
Beta feature