వంద కోట్ల క్లబ్‌‌లో ‘2018’

వంద కోట్ల క్లబ్‌‌లో ‘2018’

టోవినో థామస్, అపర్ణ బాలమురళి, కుంచకొ బొబన్, అసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ లీడ్‌‌ రోల్స్‌‌లో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘2018’. కేరళలో వచ్చిన వరదల ఆధారంగా జూడ్ ఆంథనీ జోసెఫ్ తెరకెక్కించిన ఈ మలయాళ చిత్రం పది రోజుల్లో వంద కోట్ల క్లబ్‌‌లో చేరి అక్కడ ఆశ్చర్య పరిచింది. ఈ నెల 26న తెలుగులో బన్నీ వాసు విడుదల చేయగా ఇక్కడ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో నిర్వహించిన సక్సెస్‌‌ మీట్‌‌లో టోవినో థామస్ మాట్లాడుతూ ‘ఈ సినిమాను ఊహించని స్థాయిలో రిసీవ్ చేసుకున్నందుకు తెలుగు ప్రేక్షకులకు థాంక్యూ. నా తర్వాతి సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యేటట్లు చూస్తాను’ అన్నాడు. ఇందులో పార్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందంది అపర్ణ. కేరళ వరదల సమయంలో బన్నీ వాసు గారు అప్పుడు రూ.63 లక్షల ఫండ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది’ అన్నాడు దర్శకుడు. కంటెంట్ ఉన్న చిత్రాలను ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారన్నారు బన్నీ వాసు. నిర్మాత ఎస్‌‌కెఎన్ పాల్గొన్నారు.