
తమిళ స్టార్ డైరెక్టర్ మారీ సెల్వరాజ్(Mari selvaraj) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మామన్నన్(Maamannan). ఉదయనిధి స్టాలిన్(Udayanidhi stalin) హీరోగా నటించిన ఈ మూవీ.. జూన్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు మిక్సుడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు.. రెండో రోజు నుండి కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి.
దీంతో సినిమా సక్సెస్ సాధించిన సందర్బంగా డైరెక్టర్ మారీ సెల్వరాజ్ కు కాస్ట్లీ కార్ గిఫ్టుగా ఇచ్చారు మామన్నన్ మూవీ హీరో ఉదయనిధి స్టాలిన్. స్టైలీష్ లుక్ లో ఉన్న ఈ మిని కూపర్ కారు విలువ దాదాపు 60లక్షల వరకు ఉటుందని సమాచారం. దీనికి సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు డైరెక్టర్ మారి సెల్వరాజ్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
ఇక ఉదయనిధి స్టాలిన్ హీరోగా వచ్చన మామన్నన్ మూవీలో కీర్తి సురేష్(Keerthi Suresh) హీరోయిన్ గా నటించగా.. మళయాళ నటుడు ఫాహద్ ఫాజిల్(Fahadh Faasil) విలన్ గా నటించారు.