రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విధాత మూవీ..

రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో విధాత మూవీ..

భాస్కర్, కోటేశ్వర రావు ప్రధాన పాత్రల్లో  మణికంఠ రాజేంద్ర బాబు దర్శకత్వంలో అప్పినపల్లి భాస్కరాచారి  నిర్మిస్తున్న  చిత్రం ‘విధాత’.  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా త్వరలో  థియేట్రికల్ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన కాదంబరి కిరణ్ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  దర్శకుడు మణికంఠ రాజేంద్రబాబు మాట్లాడుతూ ‘నేను షార్ట్ ఫిలిం చేద్దామనే ప్రయత్నంలో ఉండగా, నిర్మాత భాస్కరాచారి గారు   సినిమా చేద్దామన్నారు. 

ఇందులో ఆయన కీలక పాత్ర కూడా పోషించారు. ఈ సినిమాకు అందరూ  సపోర్ట్ చేస్తారని  కోరుకుంటున్నా’ అని అన్నాడు.  కొన్ని వాస్తవ ఘటనల నేపథ్యంతో ఈ సినిమాను నిర్మించామని,   కథా కథనాలు, పాత్రలు ఎంతో సహజంగా ఉంటాయని నిర్మాత అప్పినపల్లి భాస్కరాచారి చెప్పారు.  మ్యూజిక్ డైరెక్టర్ డ్రమ్స్ రాము సహా టీమ్ అంతా పాల్గొన్నారు.