
మంచు విష్ణు(Manchu Vishnu) ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa). పరమశివుడి భక్తుడైన కన్నప్ప జీవిత కాదా ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukesh kumar singh) తెరకెక్కిస్తున్నాడు. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో మంచు ఫ్యామిలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక కాస్టింగ్ విషయంలో కన్నప్ప టీమ్ ఆడియన్స్ ను అవాక్కయ్యేలా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం దాదాపు అన్ని భాషల నుండి స్టార్స్ ని తీసుకున్నారు.
కన్నప్ప టీజర్ అప్డేట్
తాజాగా కన్నప్ప టీజర్ రిలీజ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ టీజర్ మే 20న రిలీజ్ చేయనున్నట్లు విష్ణు సరికొత్త పోస్టర్ షేరు చేస్తూ ప్రకటించాడు. "మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపడానికి వేచి ఉండలేకపోతున్నాను. 'కేన్స్ ఫిలిం ఫెస్టివల్'లో టీజర్ లాంచ్ చేస్తున్నాం" అంటూ విష్ణు ట్వీట్ చేశారు. ఇక ఈ ప్రతిష్టాత్మకమైన టీజర్ మే 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు వస్తుందని పోస్టర్ లో తెలిపారు.
ప్రతిష్టాత్మక వేదికపై..
ఫ్రాన్స్‌లో జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’(Cannes Film Festival)లో కన్నప్ప టీజర్ లాంచ్ కానుందని హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు. “ మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీ అందరికీ చూపించేందుకు ఆగలేకపోతున్నా. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‍లో లాంచ్ కానుంది” అని సంతోషం వ్యక్తం చేస్తూ మంచు విష్ణు తాజాగా ట్వీట్ చేశారు.
ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఎముకలతో చేసిన ఆయుధాన్ని చేతిలో పట్టుకొని ఉన్న పోస్టర్‌ను కూడా విష్ణు రివీల్ చేశారు. ఆ ఆయుధానికి రక్తపు మరకలు ఉన్నాయి.ఇప్పటి వరకు కన్నప్ప నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీని పెంచాయి. దీంతో టీజర్ ఎలా ఉంటుందోనని సినీ ప్రేక్షకులు ఎంతోగాను ఎదురుచూస్తున్నారు. ఇక ఈ టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ అప్డేట్ టీజర్లో చెబుతారేమో చూడాలి.
ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థపై మంచు విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమాకు స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. మరి మంచు ఫ్యామిలీలోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Can’t wait to show you all The World Of #????????? on the 20th May. Launching it in 'Cannes Film Festival'??#TheWorldOfKannappa #CannesFilmFestival pic.twitter.com/RghIZDIYx5
— Vishnu Manchu (@iVishnuManchu) May 13, 2024