Vishwak Sen: ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాను రీమేక్ చేస్తా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్

Vishwak Sen: ఎన్టీఆర్ డిజాస్టర్ సినిమాను రీమేక్ చేస్తా.. విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్

మాస్ కా దాస్ హీరో విశ్వక్ సేన్(Vishwak sen) కు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Ntr) అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సందర్భంలో కూడా ఆయన గురించి మాట్లాడటానికి వెనుకాడడు విశ్వక్. అందుకే ఎన్టీఆర్ ని మాస్ అమ్మ మొగుడు అంటూ ఉంటాడు. ఇక ఎన్టీఆర్ కూడా అదే ప్రేమను విశ్వక్ పై చూపిస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే విశ్వక్ హీరోగా వచ్చిన దాస్ కా ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు ఎన్టీఆర్.

ALSO READ | Rajinikanth: దుబాయ్ గోల్డెన్ వీసా అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్

ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి తన అభిమాన హీరో ఎన్టీఆర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా వస్తున్న ;లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు హీరో విశ్వక్. 

ఇంటర్వ్యూలో.. మీకు ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం కదా.. ఒకవేళ ఆయన సినిమాల్లో ఒక సినిమాను రీమేక్ చేయాలంటే ఏ సినిమాను రీమేక్ చేస్తారు అని అడిగారు యాంకర్. దానికి సమాధానంగా.. నా అల్లుడు సినిమాను చేస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇది విన్న ఆడియన్స్ షాకవుతున్నారు. ఎవరైనా హిట్టు సినిమాను రీమేక్ చేయాలనుకుంటారు కానీ, విశ్వక్ ఏంటి డిజాస్టర్ మూవీ పేరు చెప్పాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. హిట్టు సినిమాను ఎవరైనా రీమేక్ చేస్తారు కానీ, ప్లాప్ సినిమాను రీమేక్ చేసి హిట్టు కొట్టి చుపించాలనేమో విశ్వక్ ప్లాన్ అని మరికొందరు అనుకుంటున్నారు.