
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth)కు అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. తాజాగా ఆయన యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) నుండి గోల్డెన్ వీసా అందుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రజినీకాంత్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. యూఏఈ నుండి గోల్డెన్ వీసా అందుకోవడం చాలా ఆనందంగా ఉందంటూ తెలిపారు. తనకు ఈ గౌరవాన్ని అందించిన యూఏఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రజనీకాంత్.
వివిధ దేశాల నుండి, వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి 10 ఏళ్ల కాలపరిమితితో యూఏఈ ఈ ప్రత్యేక వీసాలను అందిస్తోంది. అలా 2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలను అందజేస్తోంది దుబాయ్. ఇక ఈ వీసాలు అందుకున్న ఇండియన్స్ లలో.. షారుఖ్‌ఖాన్, సంజయ్ దత్, అల్లు అర్జున్, త్రిష, అమలాపాల్, మోహన్ లాల్, మమ్ముట్టి, టోవినో థామస్, దుల్కర్ సల్మాన్, ఉపాసన, ఉన్నారు. ఇప్పుడు ఈ లిస్టులో సూపర్ స్టార్ రజినీకాంత్ చేరారు.
ALSO READ | Anne Hathaway: ఈ హాలీవుడ్ భామకు మన హీరోలు కావాలట.. ఇంకా ఏమందో తెలుసా?
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వెట్టయ్యాన్ సినిమా చేస్తున్నారు. జై భీమ్ ఫేమ్ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.