సినీ హీరోయిన్ శ్రీలీల శనివారం కొత్తపేటలో సందడి చేశారు. అష్టలక్ష్మి కమాన్ పక్కన కొత్తగా ఏర్పాటు చేసిన ‘శ్రీవైభవం’ షాపింగ్ మాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాల్లోని కలర్ఫుల్చీరలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఆమెను చూసేందుకు వచ్చిన అభిమానులతో సెల్ఫీలు దిగారు. తాను నటించిన రీసెంట్ హిట్ సాంగ్‘కిస్సిక్’కు అభిమానులతో స్టెప్పులేయించారు. అలాగే మాల్ ప్రారంభోత్సవంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ మల్ రెడ్డి రంగారెడ్డి, మాల్ ఎండీ చలపతి, ఆప్తాబ్ అహ్మద్ పాల్గొన్నారు.
