పెట్రోల్ ఊరికే రాదు.. KTR ను ట్యాగ్ చేస్తూ డింపుల్ ట్వీట్

పెట్రోల్ ఊరికే రాదు.. KTR ను ట్యాగ్ చేస్తూ డింపుల్ ట్వీట్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ డింపుల్ హ‌య‌త్(Dimple Hayathi)  గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే..తాజాగా డింపుల్ మరో ట్వీట్ చేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇరుక్కుని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు నగర పోలీసులకు, మినిష్టర్ KTR ను ట్యాగ్ చేస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 'హైద‌రాబాద్ లో ట్రాఫిక్ జామ్ ఘోరంగా ఉంది. ఇంటికి చేరుకోవాలంటే గంట‌కు పైగా ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. ఇప్పుడీ ట్రాఫిక్ డీసీపీలు ఎక్కడ ఉన్నారు? ఒక‌వేళ మెడికల్ ఎమర్జెన్సీ వ‌స్తే ఏమి చేయాలి? మ‌ళ్లీ మనం హైదరాబాద్‌లో అడుగు పెట్టగలమా? ప్రియమైన ప్రభుత్వమా మాకు ఉచితంగా ఇంధనం లభించదు' అంటూ ఓ పోస్ట్ పెట్టింది. 

I mean seriously this is getting worse than anything just to reach your house it takes more than an hour now where’s the traffic dcps ? What if there is a medical emergency? Can we even step out in Hyderabad ? We don’t get fuel free dear government. @KTRBRS @TelanganaCMO pic.twitter.com/0Z4oCblc3K

— Dimple Hayathi (@DimpleHayathi) July 19, 2023

దీంతో కొంత మంది  డింపుల్ కు సపోర్ట్ గా ఉండగా.. మరి కొంత మంది నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది మీరు కావాలనే..మీ పర్సనల్ గొడవను ట్రాఫిక్ లో లాగకండి అంటూ అభిప్రాయాలు వ్యక్త పరుస్తున్నారు..రీసెంట్ గా కార్ పార్కింగ్ విష‌యంలో ఓ పోలిస్ అధికారితో వాగ్వాదం ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే.. ఒకరిపై ఒకరు గొడవపడి, కేసులు సైతం పెట్టుకున్నారు.  చాలా దుమారం రేపిన వీరి వివాదం మరోసారి ఈ  ట్వీట్ తో  చర్చలోకి వస్తున్నట్లు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

గత కొన్ని రోజులుగా అకాలంగా కురుస్తున్న వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్ తలెత్తడంపై సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసేందే. ఇక ఈ డింపుల్ హ‌య‌త్ పెట్టిన ట్వీట్ కు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరో స్పందిస్తారో చూడాలి అంటున్నారు నెటిజన్లు.