
తెలుగు సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి హిందీ సినిమాల్లో బిజీ అయ్యింది దిశా పటాని. మళ్లీ ఇన్నేళ్లకు సౌత్‌లో అడుగు పెడుతోంది. సూర్య హీరోగా శివ డైరెక్షన్‌లో రూపొందుతున్న భారీ పీరియాడిక్ ఫిల్మ్‌లో హీరోయిన్‌గా చేస్తోంది. ఇంత మంచి చాన్స్ వచ్చినందుకు ఆనందంతో పొంగిపోతోంది. ‘నా నెక్స్ట్ సినిమా సూర్యతో చేస్తున్నానని చెప్పడానికే చాలా ఎక్సయిటవుతున్నాను. ఇలాంటి లార్జర్ దేన్ లైఫ్ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నందుకు గర్వంగా ఉంది. నా రోల్ యునిక్‌గా ఉంటుంది’ అంటూ సంతోషాన్ని పంచుకుంది దిశ. ఇదొక అడ్వెంచరస్ డ్రామా ఫిల్మ్. త్రీడీ ఫార్మాట్‌లో రూపొందుతోంది. పది భాషల్లో విడుదల కానుంది. హీరోయిన్‌గా సక్సెస్ అవ్వడానికి ఇప్పటికీ స్ట్రగులవుతున్న దిశకి ఇలాంటి సినిమాలో నటించే అవకాశం రావడమంటే అదృష్టమే కదా మరి!