
పెళ్లి తర్వాత హన్సిక (Hansika) తనదైన మూవీస్ తో కెరీర్ సాగిస్తోంది. ప్రస్తుతం తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి(My Name is Shruti) అనే సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన ఈ బ్యూటీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
చాలా మంది హీరోయిన్స్ వారి పెళ్లి తర్వాత..చాలా చేంజ్ అయ్యామంటూ చెప్పుకొస్తారు. కానీ హన్సిక మాత్రం..అందుకు భిన్నంగా సమాధానాలు ఇచ్చింది. ప్రస్తుతం హన్సిక ‘105 మినిట్స్ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తో పాటు మై నేమ్ ఈజ్ శృతి అనే మూవీతో బిజీగా ఉన్నానని తెలిపింది. అంతేకాకుండా మహా అనే మూవీతో తన కెరీర్లో 50 సినిమాలు పూర్తి చేసుకొన్నట్లు వెల్లడించింది.
అలాగే, మ్యారేజ్ చేసుకున్నాక..తన లైఫ్ ఏం మారలేదంటూ చెబుతూ..'షూటింగ్ టైమ్ లో సినిమాలోని క్యారెక్టర్ లో ఉంటాను. ఇంటికెళ్లిన తర్వాత హస్బెండ్ తో ఉంటాను. అంతే తేడా.ఇక సాయంత్రం 6 తర్వాత సమయాన్ని..తన భర్తతో టైమ్ కేటాయిస్తానని..అలాగే మెయిన్ గా మ్యారేజ్ తర్వాత నా అడ్రెస్ మాత్రమే మారిందని. నా ఇంటి పేరు కూడా మారలేదని తెలిపింది. ఎందుకంటే..హన్సిక మోత్వానీ అనే ఐడెంటిటీ కోసం చాలా కష్టపడ్డాను..అందుకే పెళ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకోలేదని వివరించింది.
'మై నేమ్ ఈజ్ శ్రుతి' ఆర్గాన్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో శ్రీనివాస్ ఓంకార్ రూపొందిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో మురళీశర్మ, ‘ఆడుకాలం’ నరేన్, జయప్రకాష్, సీవీఎల్ నరసింహారావు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.