
సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో కనకదుర్గారావు పప్పుల నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘ప్రేమిస్తున్నా’.ఈ మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు ‘అరెరె’అనే ఫస్ట్ సాంగ్‌ను సోమవారం లాంచ్ చేశారు.
సిద్ధార్థ్ సాలూరి కంపోజ్ చేసిన ఈ పాటను సుద్దాల అశోక్ తేజ రాయగా అనురాగ్ కులకర్ణి పాడాడు. సంగీత దర్శకుడు భీమ్స్ ఈ పాటను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. దర్శకులు అశోక్.జి, అనుదీప్ కె.వి, భాను బోగవరుపు, లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్, పూర్ణాచారి, సురేష్ గంగుల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ప్రేమకథలో ఇదివరకు ఎవరూ టచ్ చేయని ఓ డిఫరెంట్ పాయింట్‌తో దీన్ని తెరకెక్కించాం. యువతరం మళ్లీ మళ్లీ చూడాలనుకునే అంశాలు ఇందులో ఉన్నాయి’ అని చెప్పారు.
దర్శకుడు భాను మాట్లాడుతూ ‘చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు చిత్రాల్లో నటించిన సాత్విక్ వర్మ హీరోగా, తెలుగమ్మాయి ప్రీతి నేహాను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నాం. అందరికీ కనెక్ట్ అయ్యే చక్కని ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం’ అని చెప్పాడు.