ఆక్రమణదారులపై యాక్షన్ తీసుకోండి..హైడ్రా ప్రజావాణికి బాధితుల ఫిర్యాదులు

ఆక్రమణదారులపై యాక్షన్ తీసుకోండి..హైడ్రా ప్రజావాణికి బాధితుల ఫిర్యాదులు
  •  
  • 49 ఫిర్యాదులు స్వీకరించిన అడిషనల్​డైరెక్టర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: గుడి, బడి, కమ్యూనిటీ హాళ్ల ప్లాట్లను కూడా కబ్జా చేస్తున్నారని హైడ్రా ప్రజావాణిలో ప్రజలు ఫిర్యాదులు చేశారు. సోమవారం హైడ్రా ప్రజావాణికి 49 ఫిర్యాదులందాయి. ఇందులో నాలాలు, పార్కులను ఆక్రమించి భవనాలు నిర్మించి అద్దెలు వసూలు చేస్తున్నారని కంప్లయింట్స్​వచ్చాయి. ఫిర్యాదులను హైడ్రా అడిషనల్ డైరెక్టర్​వర్ల పాపయ్య స్వీకరించారు. ఫతేనగర్ శివాలయ సమీపంలోని నాలాను ఆక్రమించి షెడ్లు వేసి నెలకు రూ. లక్షన్నర వరకు అద్దెలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. తుర్కయాంజల్ శ్రీ సూర్య సాయినగర్ లో పార్కు ల్యాండ్ తమదంటూ పక్క సర్వే నంబర్​వ్యక్తి కబ్జా చేస్తున్నారని సాయినగర్ వాసులు ఫిర్యాదుచేశారు. శామీర్​పేటలోని యూఎస్ఎం మై సిటీ లేఅవుట్ రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మించారంటూ ఫిర్యాదు చేశారు.  

నాలుగు కలెక్టరేట్లలో..

హైదరాబాద్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో  కలెక్టర్​హరిచందన 148 ఫిర్యాదులను, రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్​కలెక్టరేట్​లో అడిషనల్​కలెక్టర్ ప్రతిమా సింగ్ 73,  మేడ్చల్​మల్కాజిగిరి ఐడీఓసీ ఆఫీసు మీటింగ్​హాల్​లో కలెక్టర్ మను చౌదరి 97, వికారాబాద్​లో కలెక్టర్​ప్రతీక్​జైన్​185 ఆర్జీలను స్వీకరించారు. 

బల్దియాలో..

బల్దియాలో నిర్వహించిన ప్రజావాణిలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి మేయర్ విజయలక్ష్మి 74 ఫిర్యాదులను స్వీకరించారు. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో 91 ఫిర్యాదులు వచ్చాయి.