వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్ చాంపియన్‌‌లో.. మెద్వెదెవ్‌‌కు షాక్‌‌

వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్ చాంపియన్‌‌లో.. మెద్వెదెవ్‌‌కు షాక్‌‌

లండన్: వింబుల్డన్ గ్రాండ్‌‌స్లామ్ చాంపియన్‌‌లో తొలి రోజే సంచలనం. మాజీ వరల్డ్ నంబర్ వన్‌‌, రష్యా స్టార్ డానిల్ మెద్వెదెవ్‌‌కు చుక్కెదురైంది. సోమవారం (జులై 01) జరిగిన మెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్‌‌లో 64వ ర్యాంకర్ బెంజమిన్ బోంజి 7-–6 (7/-2), 3–-6, 7–-6 (7/-3), 6–-2తో  తొమ్మిదో సీడ్‌‌ మెద్వెదెవ్‌‌కు షాకిచ్చాడు.  

గత రెండు సీజన్లలో వింబుల్డన్ సెమీఫైనల్స్‌‌కు చేరుకున్న డానిల్ ఈసారి నిరాశపరిచాడు. ఈ మెగా టోర్నీలో ఏడుసార్లు తలపడ్డ రష్యా ప్లేయర్‌‌‌‌ తొలి రౌండ్‌‌లోనే ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ సీజన్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌‌లో రెండో రౌండ్‌‌లో, ఫ్రెంచ్ ఓపెన్‌‌లో తొలి రౌండ్‌‌లో ఓడిపోయిన డానిల్ ఇప్పుడు వింబుల్డన్‌‌లోనూ తొలి పోరులోనే నిష్క్రమించాడు. 

ఎనిమిదో సీడ్‌‌  హోల్గర్ రూనెకు కూడా తొలి రౌండ్‌‌లోనే షాక్ తగిలింది. డెన్మార్క్ స్టార్ రూనె తొలి రెండు సెట్లు నెగ్గినా తర్వాత అనుహ్యంగా తడబడి 6–4, 6–4, 5–7, 3–6, 4–6తో అన్‌‌సీడెడ్ నికోలస్ జెరీ (చిలీ) చేతిలో ఓడిపోయాడు. టైటిల్ ఫేవరెట్ రెండో సీడ్‌‌ కార్లోస్ అల్కరాజ్ (స్పెయిన్) 7–5, 6–7 (5/7), 7–5, 2–6, 6–1 తో ఫాబియో ఫోగ్నిని (ఇటలీ)పై ఐదు సెట్ల పాటు చెమటోడ్చి విజయం సాధించాడు.  

ఇక, విమెన్స్ సింగిల్స్‌‌లో టాప్ సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) 6–1, 7–5తో బ్రాన్‌‌స్టైన్ (కెనడా)ను చిత్తు చేసి శుభారంభం చేసింది. ఆరో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6–7 (4/7), 7–5, 7–5తో గాబ్రియెలా రూస్ (రొమేనియా)పై కష్టపడి గెలిచింది.