బేటీ.. బేటీ అనేవారు.. అలా చేసుంటారని అనుకోవడంలేదు

బేటీ.. బేటీ అనేవారు.. అలా చేసుంటారని అనుకోవడంలేదు

తిరగబడరా సామి(Thiragabadara sami) మూవీ దర్శకుడు ఏఎస్ రవికుమార్(AS Ravikumar) హీరోయిన్‌ మన్నారా చోప్రా(Mannara Chopra)కు మీడియా ముందు ముద్దు పెట్టడంపై పెద్ద దుమారమే రేపింది. నెటిజన్స్ ఆయనపై ట్రోల్స్ తో రెచ్చిపోయారు. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదా? అంటూ కామెంట్స్ చేశారు. అయితే ఇదే విషయంపై తాజాగా స్పందించిన దర్శకుడు ఏఎస్ రవికుమార్  హీరోయిన్‌ మన్నారా చోప్రాకు.. నాకు లేని నొప్పి మీకు ఎందుకు అంటూ చిల్లర కామెంట్లు చేశారు. దీంతో మరోసారి ఆయనను ట్రోలింగ్ తో ఆడేసుకున్నారు నెటిజన్స్. 

 

అయితే ఇదే విషయంపై తాజాగా స్పందించారు హీరోయిన్ మన్నారా చోప్రా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. సమయంలో దర్శకుడు ఏఎస్ రవికుమార్ తప్పుగా చేసి ఉంటారని నేను అనుకోవడంలేదు. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి నుంచి  ఆయన నన్ను బేటీ బేటీ అనే పిలిచే వారు. అంతే కాదు సినిమా షూటింగ్‌  సమయంలో నన్ను చాలా సార్లు మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి కావాలని అని చేసి ఉంటారని నేను అనుకోవడంలేదు అని చెప్పుకొచ్చింది మన్నారా చోప్రా. ప్రస్తుతం మన్నారా చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.