నటి నిత్యామీనన్ ఇంట విషాదం

నటి నిత్యామీనన్ ఇంట విషాదం

హీరోయిన్ నిత్యామీనన్(Nithya menon) ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిత్య అమ్మమ్మ 2023 జూలై 16  ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయిన నిత్యామీనన్.. తన బాధను తెలుపుతూ ఇన్ స్టాగ్రామ్ లో  పోస్ట్  చేశారు.   

తన అమ్మమ్మతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. “ఒక శకం ముగిసింది. గుడ్ బై అమ్మమ్మ అండ్ మై చెర్రీమ్యాన్. మిమ్మల్ని మరో లోకంలో కలుసుకుంటా” అంటూ పోస్ట్ చేశారు.  ప్రస్తుతం నిత్య చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో ఆమె అభిమానులు బీ స్ట్రాంగ్ అంటూ నిత్యకు దైర్యం చెబుతున్నారు.  

అలా మొదలైంది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన  నిత్యామీనన్... డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకుంది.  స్కిన్ షో చేయకుండా స్టార్ డమ్ సంపాదించుకున్న అతికొద్ది మంది హీరోయిన్స్ లో ఆమె ఒకరు.