ఐరెన్​ లెగ్​ కామెంట్స్​పై పూజా ఫైర్​

ఐరెన్​ లెగ్​ కామెంట్స్​పై పూజా ఫైర్​

పూజా హెగ్దే(PoojaHegde) ను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కెరీర్​పై కొందరు మితిమీరిన కామెంట్స్​ చేస్తున్నారు. గతంలోనూ పూజా నటించిన సినిమాలు కొన్ని ఫ్లాప్​గా మారాయి. తనది ఐరెన్​ లెగ్​ అని ఓ బాలీవుడ్​ క్రిటిక్​ ఇటీవల పోస్ట్​ చేశారు. 

అలాగే ప్రభాస్​, కృతి సనన్​ సైతం ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం చేశారు. తాజాగా పూజా ఇందుకు కారణమైన  ఉమైర్​ సంధు(UmairSandhu) అనే వ్యక్తిపై ఈ హీరోయిన్​ ఫైర్​ అయినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తికి లీగల్​ నోటీసులు కూడా పంపింది. అయితే, అతడు విదేశాల్లో ఉండటంతో చర్యలు తీసుకునే చాన్స్ లేకుండా పోయింది. 

ఆ వ్యక్తి పూజాను ఎగతాళి చేస్తూ ఇప్పుడు మరో పోస్ట్​ పెట్టారు. ఇది పూజా అభిమానులను మరింత ఇబ్బంది పెడుతోంది. గతంలోనూ కొందరు సినీ తారలపై అతడు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.