వరంగల్లో ఆర్ ఎస్ బ్రదర్స్ షోరూం ప్రారంభం.. సందడి చేసిన శ్రీలీల

వరంగల్లో  ఆర్ ఎస్  బ్రదర్స్ షోరూం ప్రారంభం.. సందడి చేసిన శ్రీలీల

వరంగల్, వెలుగు: వరంగల్‌‌  నగరంలో గురువారం ఆర్ఎస్​ బ్రదర్స్​ షోరూంను ప్రారంభించారు. ప్రముఖ హీరోయిన్  శ్రీలీల చీఫ్ గెస్ట్​గా హాజరై సందడి చేశారు. డైరెక్టర్లతో కలిసి జ్యోతిని వెలిగించి షోరూంను ప్రారంభించారు. 

షోరూంలోని వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్‌‌పర్సన్‌‌, హోల్‌‌ టైం డైరెక్టర్‌‌ పొట్టి వెంకటేశ్వర్లు వరంగల్‌‌ షోరూమ్‌‌లో వెడ్డింగ్‌‌ కలెక్షన్స్‌‌, సంప్రదాయ వస్త్రాలంకరణ, ప్రత్యేకతల గురించి వివరించారు. 

ప్రతి ఒక్కరి అభిరుచులకు అనుగుణంగా దుస్తులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. షోరూం ప్రారంభోత్సవానికి శ్రీలీల రావడంతో, ఆమెను చూసేందుకు నగరవాసులు పోటీపడ్డారు. మేనేజింగ్‌‌ డైరెక్టర్‌‌ సీర్ణ రాజమౌళి, తిరువీధుల ప్రసాదరావు తదితరులు  పాల్గొన్నారు.