RT 75: రవన్న దావత్ల ధమాకా బ్యూటీ.. ఇక రెడీ అయిపోండ్రా అబ్బాయిలు

RT 75: రవన్న దావత్ల ధమాకా బ్యూటీ.. ఇక రెడీ అయిపోండ్రా అబ్బాయిలు

ఈగల్(Eagle) సినిమా సక్సెస్ తో మంచి కంబ్యాక్ ఇచ్చారు మాస్ మహారాజ్ రవితేజ(Ravi Teja). దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ స్టైలీష్ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తరువాత డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో మిస్టర్ బచ్చన్ సినిమా మొదలుపెట్టాడు రవితేజ. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టాడు రవితేజ. రవితేజ కెరీర్ లో 75వ ప్రాజెక్టు గా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు భాను బొగ‌వరపు తెరకెక్కిస్తున్నాడు. 

ఇటీవల ఉగాది పండుగ సంధర్బంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సంధర్బంగా విడుదల చేసిన పోస్టర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. హ్యాపీ ఉగాది రా భయ్.. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ.. అంటూ ఇచ్చిన క్యాప్షన్ సినిమాపై అంచనాలు పెంచేసింది. పక్కా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అనౌన్స్మెంట్ తో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ పండుగ చేసుకున్నారు. ఇక అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడు మొదలుకానుంది అని ఎదురుచూస్తున్నారు. 

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుండి రెండు క్రేజీ న్యూస్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటంటే.. ఈ సినిమాలో రవితేజ సరసన లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల నటించనుందట. ఇప్పటికే ఈ కాంబోలో వచ్చిన ధమాకా మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఈ ఇద్దరి మాస్ డాన్స్ కి ఆడియన్స్ ఊగిపోయారు. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రెండు అప్డేట్ ఏంటంటే.. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందట. శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.