
సౌత్ హీరోయిన్ తాప్సి(Taapsee Pannu) ఈ మధ్య తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడంలేదు. దీనికి కారణం ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ప్రాజెక్ట్స్ చేస్తుండటమే. ఇక తాప్సి తెలుగులో కనిపించిన చివరి సినిమా "మిషన్ ఇంపాజిబుల్(Mission impossible)". ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఆమె మళ్ళీ బాలీవుడ్ లో బిజా అయిపోయింది.
ఇక చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న తాప్సి.. తాజాగా ఇంస్టాగ్రామ్ లో తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. "ఆస్క్ మీ ఎనీథింగ్" పేరుతో సరదాగా తన ఫ్యాన్స్ తో చాట్ సెషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది ఈ బ్యూటీ. చాట్ సెషన్ లో భాగంగా ఓ నెటిజన్ ఆమెను మీ పెళ్ళెప్పుడు అని అడిగాడు. దానికి సమాధానంగా తాప్సి.. నేను ఇంకా ప్రెగ్నెంట్ కాలేదు, కాబట్టి.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పికొచ్చారు.
తాప్సి చేసిన ఈ కామెంట్స్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. బాలీవుడ్ స్టార్ కపుల్ రన్బీర్ కపూర్(Ranbir kapoor), ఆలియా భట్(Alia bhat) ను ఉద్దేశించే తాప్సి ఈ కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. మరి ఈ కామెంట్స్ పై అటు తాప్సి గానీ, ఇటు రన్బీర్,ఆలియా జంట గానీ ఎలా స్పందిస్తారో చూడాలి.