మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెలుగులో వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నాడు హేషమ్ అబ్దుల్ వహాబ్. తాజాగా తను మ్యూజిక్ కంపోజ్ చేసిన మూవీ ‘గర్ల్ ఫ్రెండ్’. రష్మిక, దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా (నవంబర్ 7న) విడుదలైంది. సినిమాకు పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. భూమా పాత్రకి రష్మిక ప్రాణంపోసిందంటూ నెటిజన్లు అంటున్నారు. లవ్, ఫ్యామిలీ వంటి ఎమోషనల్ సీన్స్లో భిన్న భావోద్వేగాలు చూపించిందంటూ మెచ్చుకుంటున్నారు. ఇందులో చాలా సీన్స్ సగటు అమ్మాయిని ఆలోచింపజేసేలా ఉన్నాయంటూ ఫిమేల్ ఆడియన్స్ సైతం ట్వీట్స్ పెడుతున్నారు.
ఈ క్రమంలోనే ‘నీదే నీదే కథ’ పాట వైరల్ అవుతుంది. రాకేందు మౌలి ఈ పాట రాయగా అనురాగ్ కులకర్ణి పాడారు. నీదే నీదే కథ.. ఇపుడు ప్రతి అమ్మాయికి ఆంథెమ్‌గా మారిందంటూ, ఎంతో లోతైన అర్ధాన్ని ఇచ్చేలా లిరిక్స్ ఉన్నాయంటూ చెప్పుకుంటున్నారు. ఈ పాట విశేషాలు.. గర్ల్ ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ మాటల్లో..
ఈ సందర్భంగా హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ ‘ప్రేమ కథా చిత్రాలకే నేను ఎక్కువ వర్క్ చేశాను. అయితే ఈ కథలోని ఇంటెన్సిటీ వేరు. రష్మిక, దీక్షిత్ పాత్రల మధ్య ఉండే సంఘర్షణే ఈ సినిమాకు మంచి పాటలు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ముఖ్యంగా మహిళలకు మరింత నచ్చుతుంది.
ఇందులోని నాలుగు పాటలు సందర్భానుసారం వచ్చేవే. వాటిలో చివరిదైన ‘నీదే నీదే కథ’ పాట కంపోజింగ్ కోసం ఎక్కువ కష్టపడ్డాను. ఈ పాట ప్రతి అమ్మాయి ఆంథెమ్‌గా ఉండాలని రాహుల్ చెప్పడంతో కొంత ఎక్కువ టైమ్ తీసుకున్నా. కెరీర్‌లో ఎక్కువగా లవ్ సాంగ్స్ చేసిన నేను, త్వరలో మాస్, బీట్ సాంగ్స్ కూడా చేయబోతున్నా.
వేదన, వేద పాఠమై నేర్పే ప్రయాణమా!!!
— Aravind Krishna (@mentalmadhilo45) November 5, 2025
సమాధి అయిన సహనం, సమాధానం అడిగే
సదా కథనం అయ్యే మధన యెద నీ కథనమే!!!
ఈ సినిమాలోని అన్నీ పాటల్లో తెలుగు పదాలను అందంగా కూర్చిన తీరు ప్రశంసనీయం @RakenduMouliV ❤️❤️#TheGirlFriend | @23_rahulr | @HeshamAWmusic
తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడం సంతోషంగా ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ మూవీస్ చేస్తున్నా. కన్నడ, హిందీలోనూ డెబ్యూ ఇవ్వబోతున్నా’ అని చెప్పాడు.
