లగ్జరీ ఆటో.. డ్రైవర్ అద్భుత ఆలోచనకు ఫిదా

లగ్జరీ ఆటో.. డ్రైవర్ అద్భుత ఆలోచనకు ఫిదా

వ్యాపారస్తులు కస్టమర్లను ఆకర్షించడానికి రక రకాలు పద్దతులు అవలంభిస్తారు.  మా వద్ద నాణ్యత ఉందంటే.. మరొకటి ఇది కొంటే అది ఫ్రీ అని నానా హంగామా చేస్తుంటారు.  ఇప్పుడు అలాగే ఆటో డ్రైవర్లు కూడా నానా తంటాలు పడుతున్నారు. మొన్నీ మధ్యన కూలర్ ఆటో వైరల్ కాగా.. ఇప్పుడు బెంగళూరులో లగ్జరీ ఆటో వైరల్ అవుతుంది.  

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ అందరి ఆటోలా కాదు.. తన ఆటోకు ప్రత్యేకత ఉండాలని డిఫరంట్ గా తయారు చేయించుకున్నాడు.  ఇప్పుడు ఆ ఆటో సోషల్ మీడియాలో తెగతిరిగేస్తుంది.  ఇటీవల కాలంలో చాలామంది ఆటో డ్రైవర్లు ఆటోలను అప్ గ్రేడ్ చేస్తున్నారు. వేసవికాలంలో కస్టమర్లు ఇబ్బంది పడకుండా ఆటో వెనుక భాగంలో కూలర్ అమర్చి అందర్నీ ఆకట్టుకున్నాడు ఓ ఆటో డ్రైవర్. ఇక బెంగళూరులో కొత్తగా వచ్చిన  హైటెక్ ఆటో చూస్తే ఫిదా అయిపోతారు. ఈ ఆటోలో గాజు కిటికీలు..రెండు ఫ్యాన్లు .. ఖరీదైన సీట్లు ఆకట్టుకుంటాయి.

దివంగత నటులు శంకర్ నాగ్, పునీత్ రాజ్ కుమార్ పోస్టర్లు కూడా ఉన్నాయి. స్టీరింగ్ వీల్ పక్కన ఒక రకమైన డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది. ఆటో రంగు రంగుల లైట్లతో మెరిసిపోతోంది. ట్విట్టర్ యూజర్ అజిత్ సహాని Ajith Sahani ఈ వీడియోని షేర్ చేశారు. “హలో #బెంగళూరు ఎంత అందమైన మరియు అద్భుతమైన ఆటో.. ఎవరైనా ఇంత దూరం ప్రయాణించారా” అనే శీర్షికతో ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియో సుదూర ప్రాంతాల నుండి వీక్షకుల నుండి త్వరగా ప్రతిస్పందనలను పొందింది. ఒక వినియోగదారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, “ఆటో చాలా బాగుంది. అలాంటి ఆటోలో ప్రయాణించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది." మరొక వ్యక్తి ఇలా అన్నాడు.  శ్రీలంకలో అలాంటి ఆటోలను చూశానంటూ వాటిని  ఇష్టపడ్డానని కామెంట్లు పెట్టారు."

దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘ఆటో డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ కావాలని.. బెంగళూరు వాళ్లు ఏం చేసినా గర్వంగా ఉంటుందని’ కామెంట్లు పెట్టారు. తాము అందరిలో ప్రత్యేకంగా కనిపించాలని కావచ్చు.. ప్రయాణికులను ఆకర్షించడానికి కావచ్చు ఆటో డ్రైవర్లు కూడా సరికొత్త క్రియేటివిటీతో ముందుకు వెళ్తున్నారు.

https://twitter.com/ajithkumar1995a/status/1664335898216112128
https://twitter.com/ajithkumar1995a/status/1664335903018614784