
హైదరాబాద్ : సరూర్ నగర్ లో హైటెక్ తరహాలో ఎగ్జామ్ కాపీ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడు హర్యాణాకి చెందిన ఓ యువకుడు. కర్మాన్ ఘాట్ లోని SEZ టెక్నాలజీస్ ఎగ్జామ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. హరియాణాలో ఉన్న స్నేహితులకు సిగ్నల్ అందేలా అంతా సెట్ చేసి..ఎగ్జామ్ రాసేందుకు ప్రయత్నించాడు యువకుడు. అయితే సీసీ కెమెరాల ద్వారా నిర్వాహకులు దీన్ని పరిశీలించారు. ఎగ్జామ్ మొదలైనప్పటి నుంచి సౌరభ్ అటు.. ఇటు కదులుతూ కనిపించాడు. దీంతో అనుమానం వచ్చిన నిర్వహకులు సీసీ ఫోటేజ్ ను పరిశీలించారు. మరోసారి సౌరభ్ ను చెక్ చేయడంతో రిసీవర్ తో పాటు... కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు కనిపించాయి. దీంతో నిందితుడిని సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు.