సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎక్కువమంది వాడేవాటిలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ కచ్చితంగా ఉంటుంది. దీంట్లో మంచి యూస్ ఫుల్ కంటెట్ తోపాటు నవ్వకోవడానికి మీమ్స్ కూడా ఉంటాయి. అలాగే డైలాంగ్స్, మ్యూజిక్‌కు క్రియేటివ్ రీల్స్ కూడా చేయోచ్చు. అందుకే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల సంఖ్య ఈ మధ్యకాలంతో విపరీతంగా పెరుగుతుంది. ప్రైవసీ విషయంలో కూడా ఇన్‌స్టాగ్రామ్ యూజర్లుకు చాలా ఆప్షన్లు అందిస్తోంది. మార్కెటింగ్, ప్రమోషన్స్ కు కూడా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. ఎంటర్టెన్మెంట్కే కాదు.. మనీ ఎర్నింగ్‌కి కూడా ఇన్‌స్టాగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది.
చాలామంది ఛానల్స్ పెట్టి బెస్ట్ కంటెంట్ ఇచ్చి వేలల్లో ఫాలోవర్స్ తెచ్చుకొని.. లక్షల్లో డబ్బులు సంపాధిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉన్నవారు లైక్స్ గురించి వర్రీ అవుతుంటారు. ఈ ట్రిక్ తో పోస్టులకు వచ్చిన లైక్స్ మేనేజ్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఫోస్ట్‌కు ఎన్ని లైక్స్ వచ్చాయో ఫాలోవర్స్ కు తెలియకుండా ఉండాలంటే ఈ ఆప్షన్ బాగా యూస్ అవుతుంది.
Also Read :- గచ్చిబౌలి IIIT క్యాంపస్ చికెన్ బిర్యానిలో కప్ప
ఇన్‌స్టాగ్రామ్ పోస్టులకు లైక్స్ కౌంట్ హైడ్ చేసుకోండిలా..
- ఇస్టాగ్రామ్‌లో మీ అకౌంట్ ఓపెన్ చేసి.. పోస్ట్ పై క్లిక్ చేయండి.
- పోస్ట్ కుడివైపు పైన ఉన్న త్రి డాట్స్ పై క్లిక్ చేయండి.
- మీకు కొన్ని ఆప్షన్స్ చూసిస్తోంది.. వాటిలో నాలుగో ఆప్షన్ హైడ్ లైక్ కౌంట్ అని ఉంటుంది.
- దానిపై క్లిక్ చేస్తే మీరు పెట్టిన ఆ పోస్ట్ కు ఎన్ని లైక్స్ వచ్చాయో మీ ఫాలోవర్స్ కు కనిపించదు.
- ఇది మీ ప్రైవసీలో భాగం.. మీరు ఇచ్చే కంటెంట్‌కు వచ్చే లైక్స్ ఇతరులు చూడొద్దు అనుకుంటే ఇలా చేయోచ్చు.