ఇటీవల కాలంలో ఫుడ్ అడల్ట్రేషన్ వార్తలు సోషల్ మీడియాలో తొగ చక్కర్లు కొడుతున్నాయి. ఐఐఐటీ క్యాంపస్ మెస్ లో వడ్డించిన బిర్యానిలో కప్ప ప్రత్యేక్షమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ గచ్చిబౌలి ఐఐఐటిలో అక్టోబర్ 16న విద్యార్థులకు బిర్యానిలో కప్ప కనిపించింది.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. త్రిబుల్ ఐటీ కదాంబ మెస్స్ లో విద్యార్థులు చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానిలో కప్ప రావడంతో విద్యార్థులు కంగుతిన్నారు. వెంటనే మెస్ ఇంచార్జ్ కి పిర్యాదు చేశారు. బిర్యానీ లో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫోటో తీసి విద్యార్థులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
ALSO READ | మల్కాజిగిరిలో ఉంటున్నారా..? అయితే జర జాగ్రత్త.. ఎందుకంటే..