మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. కిలో వెండి రూ.82 వేలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. కిలో వెండి రూ.82 వేలు

గోల్డ్​ కొనాలనుకుంటున్న వారికి బ్యాడ్​ న్యూస్​. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్​, సిల్వర్​ ధరలు గరిష్ఠానికి చేరుకున్నాయి. జులై 21న ధరలు కాస్త దిగివచ్చినా.. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మగువలకు ఇష్టమైన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇంటర్నేషనల్​ మార్కెట్లో గోల్డ్​ రేట్​ దిగివచ్చినప్పటికి హైదరాబాద్​లో ధరల తగ్గుదలలో మార్పు కనిపించలేదు. 

సిటీలో 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం రూ. 100  పెరిగి రూ. 55 వేల 700లకు చేరింది.  24 క్యారెట్ల గోల్డ్​10 గ్రాములకు రూ. 100 పెరిగి ప్రస్తుతం రూ. 60 వేల 750 పలుకుతోంది.  ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేట్​రూ. 100 పెరిగి రూ. 55 వేల 850 వద్ద కొనసాగుతోంది.  24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 పెరిగి రూ. 60 వేల 900 పలుకుతోంది.  

అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలు తగ్గిన క్రమంలో డాలర్ విలువ కనిష్టానికి  పడిపోతోంది. దీంతో గోల్డ్​ వ్యాల్యూ రోజురోజుకీ పెరుగుతోంది.  

రూ.82 వేలకు చేరుకున్న వెండి..

గోల్డ్​కి ఏ మాత్రం తీసిపోకుండా సిల్వర్​ రేట్లు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్​లో జులై 21న  కిలో వెండిపై రూ. 400 పెరగడంతో వెండి రేటు హైదరాబాద్‌లో రూ.82 వేల 400చేరింది.  ఢిల్లీలో బంగారం ధర పెరిగినప్పటికీ సిల్వర్​ రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. అక్కడ ప్రస్తుతం కిలో వెండి రూ. 78 వేల 400 పలుకుతోంది.