హైద్రాబాద్ లో పోలీసులు హై అలర్ట్..

హైద్రాబాద్ లో పోలీసులు హై అలర్ట్..

శ్రీలంకలోని కొలంబో పేలుళ్ల నేపథ్యంలో సిటీపోలీసులు అలర్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా చర్యలు చేపట్టారు. కొలంబోలో బాంబు పేలుళ్ల గురించి తెలిసిన నిమిషాల వ్యవధిలోనే రాష్ట్ర ఇంటలిజెన్స్ విభాగంతో పాటు సిటీ సెక్యూరిటీ వింగ్, పోలీస్ ఉన్నతాధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిసింది. అలాగే నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో ఎన్ఐఏ తనిఖీల్లో పట్టుబడ్డఐసీస్ సానుభూతిపరుల బంధువుల వివరాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎక్కడికక్కడ స్థానిక పోలీసులను అలర్ట్ చేసి అనుమానితులు, సమస్యా త్మక ప్రాంతాల్లో నిఘా పెట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా హైదరాబాద్ తోలింకులు ఉండటంతో నగర పోలీసులు అప్రమత్తయ్యారు.

పాకిస్థా న్, బంగ్లాదేశ్‌ , నైజీరియా తదితర దేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించడంతోపాటు వీసా గడువులను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అలాగే ఎన్ఐఏ శనివారం విచారించిన ముగ్గురిపై నిఘా పెట్టారు. వారి కుటుంబ నేపథ్యంతో పాటు ఇన్నాళ్లు ఇక్కడ ఏం చేశారనే దానిపై ఆరా తీస్తు న్నట్లు సమాచారం. ఎన్ఐఏ అదుపులో ఉన్న జీషాన్, మసూద్‌‌ తాహాజ్, షిబ్లీబిలాల్‌ పూర్తి వివరాలను తెలుసుకుంటున్నారు.తాహాజ్, బిలాల్‌ , జీషాన్ లను మరోసారి విచారించారు. కొలంబోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లకి బాసిత్ నెట్ వర్క్ కి ఏమైనా లింకుల ఉన్నా యేమోనని ఆరా తీసినట్లు తెలిసింది. ముగ్గు రు అను మానితుల్లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మసూద్ తాహాజ్ మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌‌ వచ్చాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ సోషల్ మీడియాలో బాసిత్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. దీంతో ఉగ్రవాద సంస్థలు సోషల్ మీడియాను అడ్డాగా చేసుకొని కార్యకలాపాలు  కొనసాగిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి. టెర్రరిస్టులు తమ ఐటీ వింగ్ ను దుబాయ్, ఇంగ్లండ్ తో పాటు పాకిస్థా న్,బంగ్లాదేశ్ లలో ఏర్పాటు  చేసినట్లు ఎన్ఐఏఅధికారులు గుర్తిం చారు. నాలుగేళ్ల క్రితం బెంగళూరులో పట్టుబడ్డ ఉబేద్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి కేస్ స్టడీని పరిశీలిం చినట్లు తెలిసింది.

ఎక్కడా వదలకుండా..

ఈ నేపథ్యంలోనే సిటీలోని అనుమానాస్పద ప్రాంతాలపై నిఘా పెంచారు. పాతబస్తీలోనికొన్ని ఏరియాలపై డేగ కన్ను వేశారు. రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లతో పాటు కమర్షియల్ కాంప్లెక్స్ల వద్ద భద్రతపై నిఘాపెట్టారు. సీసీ కెమెరాలతో అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గమనిస్తు న్నా రు. ముఖ కవళికలను స్కాన్ చేస్తున్నా రు.అలాగే దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు,మసీదుల వద్ద మెటల్ డిటెక్టర్లతో చెకింగ్ చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపుజాగ్ నీకి రాత్ సందర్భంగా శనివారం అర్ధరాత్రి సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పాతబస్తీలో పర్యటించారు.

High, alert, hydrabad ,police, ofter, srilanka, bomb, blast