ఏజెన్సీలో అలర్ట్..

ఏజెన్సీలో అలర్ట్..

తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, చత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని ఏజెన్సీలో యుద్ధ వాతావరణం నెలకొంది.మావోయిస్టులు పార్లమెంటు ఎన్నికల్లో విధ్వంసాలు సృష్టించే అవకాశముందనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఓ వైపు మావోయిస్టుల పేరుతో కరపత్రాల పంపిణీ, బ్యానర్ల ఏర్పాటు ,మరోవైపు ప్రత్యేక పోలీస్‍ బలగాల మోహరింపుతో దండకారణ్యం లో ఎప్పుడేం జరుగుతుందోననే భయం ఏజెన్సీ వాసుల్లో నెలకొంది.పార్లమెంటు ఎన్ని కలను బహిష్కరిం చాలంటూ మావోయిస్టులు తెలంగాణ, చత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్‍, ఒడిశా సరిహద్దుల్లో ని ఏజెన్సీ ప్రాంతాల్లో పెద్దఎత్తున కరపత్రాలు, పోస్టర్లు , బ్యానర్లు కడ్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ–చత్తీస్ గఢ్ తోపాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలైన చర్ల, వెంకటాపురం, ఏటూరునాగారం, వాజేడు, మహాదేవ్ర్‍,తాడ్వా యి, ములుగుతో పాటు భద్రాచలం డివిజన్లో నిత్యం ఎక్కడో ఓచోట మావోయిస్టుల కరపత్రాలు,వాల్‍ పోస్టర్లు , బ్యానర్లు వెలుస్తున్నాయి. పార్లమెంటు ఎన్నికలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్‍తో కరపత్రాలను పంచుతున్నారు. మోటార్‍ సైకిల్‍పై వచ్చి కరపత్రాలను ఆయా ప్రాంతాల్లో పంపిణీ చేసి నట్టు గా పోలీసులు గుర్తించారు. ప్రధానంగా రాష్ట్ర,డివిజన్‍, ఏరియా కమిటీల పేర ప్రకటనలొస్తున్నాయి. బ్యానర్లు వెలుస్తున్నాయి.

విధ్వంసాలే లక్ష్యంగా

పార్లమెంటు ఎన్ని కలే లక్ష్యంగా విధ్వంసాలు సృష్టిం చేందుకు మావోయిస్టులు వ్యూహాలు పన్నుతున్నట్టు గా పోలీసులు గుర్తించారు. ఇటీవలి కాలంలోమావోయిస్టు బెటాలియన్‍ కమాండర్‍ ఇడుమప్రధాన అనుచరుడు సవలం సోమాతో పాటు మరో ఇద్దరి ని భద్రాద్రికొత్తగూడెం పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో పలు విషయాలు వెల్లడైనట్టు సమాచారం. పార్లమెంటు ఎన్ని కల సందర్భంగా పోలీస్‍ బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు భారీ విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉందని పోలీసుల దృష్టికి వచ్చింది. కూంబింగ్‍ నిర్వహించే ప్రత్యేక బలగాలను మట్టు బెట్టేం దుకు మందుపాతర్లనుఏజెన్సీలో మస్తుగా ఏర్పాటు చేసినట్టు గా పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ–చత్తీస్ గఢ్ సరిహద్దులోని వెంకటాపురం అటవీ ప్రాంతంలో మందుపాతర పేలి నాలుగు రోజుల కిందట గిరిజనుడుమృతిచెందాడు. అడవిలో వెళ్తున్న గిరి జనుడు మందుపాతర ఉన్న విషయం తెలియక దానిపై అడుగు వేయడంతో అది పేలింది. దీంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాతో పాటు ములుగు, జయశంకర్‍ భూపాలపల్లి జిల్లాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. పేలుడు పదార్థాలకు అవసరమైన సామగ్రిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్ తులను భద్రాద్రికొత్తగూడెం జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి హరిభూషన్‍తో పాటు పలు దళాల్లో పనిచేసిన మావోయిస్టు దళ సభ్యుడు భీమన్నతో పాటు మరో మగ్గురు మిలిషియా సభ్యు లను సైతం పోలీసులు అరెస్టు చేశారు. యాక్షన్‍ టీం సభ్యులు ఇటీవలి కాలంలో ఉమ్మడి ఖమ్మం , వరంగల్, కరీంనగర్‍ జిల్లాల్లో ని పలు ప్రాంతాల్లో సంచరించినట్టు గా పోలీసులు అనుమానిస్తున్నా రు. పార్లమెంటు ఎన్ని కల నేపథ్యం లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో అనధికార రెడ్‍ అలర్ట్​ను పోలీసులు ప్రకటించారు.

దండకారణ్యంలోకి దండిగా

తెలంగాణ–చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దుతో పాటు గోదావరి తీర ప్రాంతాల్లోకి నక్సల్ స్ వచ్చే అవకాశం ఉందని పెద్దఎత్తున ప్రత్యేక పోలీస్‍ బలగాలు, పారా మిలిటరీని దింపుతున్నారు. ఎన్ని కల నేపథ్యంలో ఇప్పటికే బోర్డర్‍ సెక్యూరి టీ, ప్రత్యేక పోలీస్‍ బలగాలతో జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో పోలీసులు మేము మీకు రక్షణగా ఉన్నామంటూ కవాతు నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,079 పోలింగ్‍ స్టేషన్లు ఉండగా ఇందులో 156 ప్రాంతాలను మావోయిస్టు ప్రభావిత పోలిం గ్‍ కేంద్రాలుగా పోలీసులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే మావోయిస్టుల కోసం ముమ్మరంగా కూంబిం గ్‍ నిర్వహిస్తున్నారు. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున కూంబింగ్‍ చేపట్టారు. ఇందులో భాగంగానే మాజీ మావోయిస్టులతో పాటు కొరియర్లను, సానుభూతి పరులను బైండోవర్‍ చేస్తున్నారు.