
హైదరాబాద్: తన పాదయాత్ర కు అనుమతి ఇవ్వాలని కోరుతూ తీన్మార్ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోడు భూముల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత నెల 26వ తేదీన పాదయాత్ర చేపట్టగా.. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు పాదయాత్ర నిలిపేశారు.
దీంతో తన పాదయాత్ర అనుమతి ఇవ్వాలని కోరుతూ తీన్మార్ మల్లన్న హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేయగా.. హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్ర రూట్ మ్యాప్, ఎంత మంది పాదయాత్ర లో పాల్గొననున్నారనే వివరాలు సమర్పించాలని పిటిషనర్ కు హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.