నోటీసులు ఇచ్చాకే.. ఆస్తులు జప్తు చేయాలి : హైకోర్టు

నోటీసులు ఇచ్చాకే.. ఆస్తులు జప్తు చేయాలి : హైకోర్టు
  • సహకార శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు: ఎవరైనా అధికారి లేదా ఉద్యోగి అక్రమాలకు పాల్పడినప్పుడు వారి ఆస్తులను జప్తు చేయాలని నిర్ణయిస్తే.. చట్ట ప్రకారం నోటీసులు జారీ చేయాలని హైకోర్టు సూచించింది. నేరుగా నిందితుల ఆస్తులను జప్తు చేయడం చట్ట వ్యతిరేకమని వెల్లడించింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా సహకార సంఘం రిజిస్ట్రార్‌‌‌‌‌‌‌‌ జారీ చేసిన జప్తు ఉత్తర్వులను రద్దు చేసింది. తిరిగి జప్తు నోటీసులు ఇవ్వొచ్చునని, అభియోగాలను ఎదుర్కొనే వాళ్ల వాదనలు వినాలని, ఆపై జప్తునకు ఆస్కారం ఉంటుందని వివరించింది. నోటీసులు అందుకున్న వాళ్లకు అభ్యంతరం ఉంటే సహకార సంఘ ట్రిబ్యునల్‌‌‌‌‌‌‌‌ను ఆశ్రయించవచ్చని తెలిపింది. 

మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం యమాపూర్‌‌‌‌‌‌‌‌ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ సర్‌‌‌‌‌‌‌‌చార్జి వసూళ్లలో అప్పటి సీఈఓ టి మధుకర్‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.76.28 లక్షల రికవరీలో భాగంగా తన ఆస్తులను జప్తు చేయడాన్ని భార్య తిరునగరి సరిత హైకోర్టులో పిటిషన్‌‌‌‌‌‌‌‌ వేశారు. మరో ఇద్ద రు ఉద్యోగులకు చెందినవారు, మల్లాపూర్‌‌‌‌‌‌‌‌ మండలం చిత్తాపూర్‌‌‌‌‌‌‌‌ పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌ మాజీ సీఈఓ తల్లికి చెందిన ఆస్తులను జప్తు చేయడాన్ని సవా ల్‌‌‌‌‌‌‌‌ చేసిన వ్యాజ్యాలను జస్టిస్‌‌‌‌‌‌‌‌ టి మాధవీదేవి ఇటీవల విచారించారు. 

తొలుత పిటిషనర్‌‌‌‌‌‌‌‌ న్యాయవాది మామిండ్ల మహేశ్‌‌‌‌‌‌‌‌ వాదిస్తూ.. స్త్రీ ధనంతో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాల గడించారని చెప్పి ఆ వ్యవహారంతో సంబంధం లేని పిటిషనర్ల ఆస్తులను జప్తు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. దీనిపై సహకార శాఖ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ, సీఈఓలుగా ఉంటూ నిధులను దుర్వినియోగం చేసిన వాళ్ల పేరిట ఆస్తులు లేవన్నారు. కుటుంబసభ్యుల ఆస్తుల జప్తు చట్ట ప్రకారమేనని అన్నారు. రికార్డులను పరిశీలించిన జడ్జి నోటీసులు ఇవ్వకుండా ఆస్తుల జప్తు చెల్లదని తీర్పు చెప్పారు.