గోదావరి నీటి కాలుష్య సమస్య తెలంగాణది మాత్రమే కాదు : హైకోర్టు

గోదావరి నీటి కాలుష్య సమస్య  తెలంగాణది మాత్రమే కాదు :  హైకోర్టు
  • పిల్‌‌పై విచారణను ముగించిన హైకోర్టు


హైదరాబాద్, వెలుగు: గోదావరి నది కాలు ష్యం కేవలం తెలంగాణకు మాత్రమే చెందినదికాదని హైకోర్టు స్పష్టం చేసింది. గోదావరి నదీ పరీవాహక రాష్ట్రాలన్నింటిదని గుర్తు చేసింది. కాబట్టి గోదావరి నదీ జలాల కాలు ష్యంపై దాఖలైన పిల్‌‌పై విచారణను కొనసా గించలేమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారా న్ని నేషనల్‌‌ గ్రీన్‌‌ ట్రిబ్యునల్‌‌ (ఎన్‌‌జీటీ)లో తేల్చు కోవాలని పిటిషనర్‌‌కు హితవు చెప్పింది. గోదా వరి కాలుష్యం కేవలం తాగునీటికే పరిమితం కావడంలేదని, సాగునీటిపైనా ప్రభావం చూపుతోందని చెప్పింది. 

కాలుష్యమైన గోదా వరి నీటి సాగుతో వ్యవసాయ ఉత్పత్తుల్లో హానికర అల్యూమినియం, మెర్క్యురీ వంటి లోహాలున్నాయని, వీటి వల్ల జనం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. నదీ జలాల కాలుష్యంపై అన్ని రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలంది. ఇదేమీ తెలంగాణకు  మాత్రమే వర్తించదని చెప్పింది. 

ఈ సమస్య పరిష్కారానికి జాతీయ హరిత ట్రైబ్యునల్‌‌ (ఎన్జీటీ)ని ఆశ్రయించాలంది. గోదా వరి జలాలు కాలుష్యమవుతున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ మంచిర్యాల జిల్లాకు చెందిన ఎ. సంపత్‌‌ కుమార్‌‌ వేసిన పిల్‌‌ను జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌ సింగ్, జస్టిస్‌‌ జి ఎం మొహియుద్దీన్​లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది.