
ఏపీ సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ(OMC) కేసులో శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను హైకోర్టు కొట్టేస్తూ క్లీన్ చిట్ ఇచ్చింది. శ్రీలక్ష్మిని నిర్దోశిగా ప్రకటించింది.
2004 నుంచి 2009 మధ్య కాలంలో మైనింగ్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీగా శ్రీలక్ష్మి పనిచేశారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారని ఆమెపై అభియోగాలు ఉన్నాయి. గాలి జనార్దన్ రెడ్డికి మైనింగ్ లీజ్ విషయంలో శ్రీలక్ష్మిపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఏడాదిపాటు జైల్లో ఉన్న శ్రీలక్ష్మి..గత కొంతకాలంగా న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నారు. తనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని హైకోర్టు లో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ అభియోగాలు అవాస్తవమని వాదనలు వినిపించారు. ఎలాంటి సాక్ష్యాలు లేనందున శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలను కొట్టేస్తూ.. హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.