
వెలుగు: ‘భర్తతో విబేధించి వెళ్లిపోయి, విడాకులు తీసుకోకుండా మరొకరిని పెళ్లాడితే దానికి చట్టబద్ధత ఉండదు. ఇలా జరిగిన పెళ్లికి గుర్తింపు లేకపోవడంతో వరకట్న వేధింపులు, గృహహింస వంటి కేసులు నమోదు చేసే అవకాశం లేదు. భరణం కోరే అర్హత కూడా ఆ మహిళకు ఉండదు’ అని హైకోర్టు తేల్చి చెప్పింది. సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ఆర్మీమేనేజర్ పంకజ్ రాయ్ భార్య మరణించింది. ఆతర్వాత కృష్ణవేణి అనే ఆమెను రాయ్ రెండో పెళ్లి చేసుకున్నారు. కృష్ణవేణికి కూడా ఇది రెండో పెళ్లే. పెళ్లయిననెల రోజుల్లోనే వారి మధ్య విబేధాలు వచ్చాయి. కృష్ణవేణి రాయ్ పై గృహహింస చట్టం కింద కేసు పెట్టారు. ఈ కేసును కింది కోర్టు కొట్టేయడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించారు. తనతో పెళ్లి జరిగేనాటికి కృష్ణవేణి చేసుకున్న మొదటి పెళ్లి రద్దు కాలేదని, కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీపై కృష్ణవేణి అప్పీల్ చేసుకున్నారనే విషయాన్ని రాయ్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో మొదటి పెళ్లి రద్దు కాకుండా చేసుకున్న రెండో పెళ్లిచెల్లదని, కృష్ణవేణి పిటిషన్ ను డిస్మిస్ చేశారు.