ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించండి : హైకోర్టు

ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించండి : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: పోలీసు ఉద్యోగాల్లో మినిమమ్‌‌ కటాఫ్‌‌ మార్కులు తగ్గించాలన్న ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల విజ్ఞప్తిని పరిశీలించాలని ప్రభుత్వంతో పాటు పోలీస్‌‌ రిక్రూట్మెంట్‌‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ఎస్సై, కానిస్టేబుల్‌‌ ఉద్యోగాల్లో ఓసీ క్యాటగిరీతో సమానంగా తమకు కనీస కటాఫ్‌‌ మార్కులు నిర్ణయించాలని కోరుతూ పలువురు ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.  

ఈడబ్ల్యూఎస్‌‌ అభ్యర్థుల అర్హతకు సంబంధించి ప్రత్యేకంగా కనీస కటాఫ్‌‌ మార్కులు ఇవ్వలేదని వివరించారు. పోలీస్‌‌ రిక్రూట్మెంట్‌‌ బోర్డు అక్టోబర్‌‌ 10న ఇచ్చిన సప్లిమెంటరీ నోటిఫికేషన్ ను కొట్టివేసి.. కనీస అర్హత మార్కులు పేర్కొంటూ మళ్లీ నోటిఫికేషన్‌‌ ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.