రోడ్డు ప్రమాదాలపై వివరణ ఇవ్వండి .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

రోడ్డు ప్రమాదాలపై వివరణ ఇవ్వండి .. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు :  రోడ్డు ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో  చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది.  సుప్రీం కోర్టు గైడ్‌‌లైన్స్‌‌ అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ  కె.అఖిల్‌‌ శ్రీగురు తేజ వేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ అనిల్‌‌ కుమార్‌‌తో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ బుధవారం విచారించింది. 

పిటిషనర్‌‌ తరఫు లాయర్‌‌ ప్రభాకర్‌‌ వాదిస్తూ..రోడ్డు ప్రమాదాల్లో  తెలంగాణ ఎనిమిదో స్థానంలో ఉందన్నారు.  మోటారు వెహికల్​ చట్టం-1988లోని 214(3) నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది.