
- పిటిషనర్‌కు రూ.20 వేలు జరిమానా విధింపు
హైదరాబాద్, వెలుగు: సింగరేణి కాలరీస్ డైరెక్టర్‌గా ఎన్.బలరాం నియామకాన్ని సవాల్ చేసిన పిటిషనర్‌కు హైకోర్టు రూ.20 వేలు జరిమానా విధించింది. గతంలోనే రూ.50 వేలు జరిమానా విధించినందున.. ఈసారి రూ.20 వేలే విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. డైరెక్టర్ పదవికి పిటిషనర్ పోటీ లేరని, సింగరేణి కంపెనీలో సర్వీసులో కూడా లేరని గుర్తుచేసింది.
డైరెక్టర్ పదవిని సవాల్ చేసే అర్హత పిటిషనర్‌కు లేదని తీర్పు చెప్పింది. కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు పిటిషనర్‌కు రూ.20 వేలు జరిమానా విధిస్తూ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. సింగరేణి డైరెక్టర్, ఇన్‌చార్జి సీఎండీగా చేస్తున్న ఎన్. బలరాం డైరెక్టర్ పోస్టుకు అనర్హుడంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జి కె.సంపత్ కుమార్ వ్యక్తిగత హోదాలో పిటిషన్ వేశారు.