టూరిజం ఎండీపై ఏం చర్యలు తీసుకున్నరు : హైకోర్టు

టూరిజం ఎండీపై ఏం చర్యలు తీసుకున్నరు : హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: సస్పెన్షన్‌‌‌‌కు గురైన టూరిజం కార్పొరేషన్‌‌‌‌ ఎండీ బి.మనోహర్‌‌‌‌‌‌‌‌ రావు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఎన్నికల కోడ్‌‌‌‌ అమల్లో ఉండగా.. అప్పటి పర్యాటక మంత్రి శ్రీనివాస్‌‌‌‌ గౌడ్‌‌‌‌తో కలిసి తిరుమల వెళ్లారన్న అభియోగాలతో మనోహర్‌‌‌‌‌‌‌‌ రావును సస్పెండ్‌‌‌‌ చేశారు. 

ఎన్నికలపుడు డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తే.. ఆ తర్వాత దానిని ప్రభుత్వం ఎత్తివేసిందని, ఇదే తరహాలో పర్యాటక శాఖ ఎండీ విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించింది. మనోహర్‌‌‌‌‌‌‌‌ రావుపై సస్పెన్షన్ ఎత్తివేసి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేయడమా.. లేక ఇతర చర్యలు తీసుకున్నది చెప్పకపోవడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. తదుపరి విచారణలోగా దీనిపై నిర్ణయం తీసుకోకపోతే బాధ్యులైన పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.