హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ జేఏసీ నిర్వహించే సకల జనుల సమరభేరికి అనుమతి ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. సరూర్ నగర్ స్టేడియంలో సభకు పర్మిషన్ కోసం ఈ నెల 24న దరఖాస్తు చేసుకుంటే పోలీసులు స్పందించలేదని, అనుమతి ఇచ్చేలా ఆదేశించాలని ఆర్టీసీ జేఏసీ వేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టింది. బుధవారం నిర్వహించే సభకు కొన్ని షరతులతో అనుమతి ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్ వినోద్ కుమార్ పోలీసులను ఆదేశించారు. ఈమేరకు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి పోలీసులకు హామీ ఇవ్వాలని హైకోర్టు సూచించింది.
హైకోర్టు విధించిన షరతులు
ఊరేగింపు చేయకూడదు
ఇండోర్ స్టేడియంలో సభ జరుపుకోవాలి
మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్యలో సభ జరగాలి
రాత్రి 7 గంటలకు స్టేడియం ఖాళీ చేయాలి
రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదు
ఐదుగురే ప్రసంగించాలి, ఆపై అవసరమైతే ఒకరిద్దరు మాట్లాడవచ్చు
వక్తల పేర్లు పోలీసులకు ఇవ్వాలి
5 వేల మంది కంటే ఎక్కువ హాజరు కారాదు
సౌండ్ 85 డెసిబల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు
నలుగురికి మించి ఒకేసారి వెళ్లకూడదు
వీడియో, ఫొటోలు తీసుకునేందుకు పోలీసులకు అనుమతి ఇవ్వాలి
