హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి బ్రేక్ పడింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనానికి 2026, జూన్ 7న సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేసి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
ఈ భవనాన్ని ఉప్పల్ బగాయత్ లేఅవుట్ వద్ద దాదాపు 10 ఎకరాల స్థలంలో రూ.98 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్నారు. అయితే, మల్కాజిగిరి కార్పొరేషన్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూ రిజంప్షన్ చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఐదు రిట్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. మంగళవారం (జూన్ 9) ఈ పిటిషన్లపై జస్టిస్ బి. విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
►ALSO READ | హైదరాబాద్ సిటీ మొత్తం వర్షం : ఆఫీసుల నుంచి వెళ్లే టైంలో ట్రాఫిక్ పరేషాన్
మల్కాజిగిరి కార్పొరేషన్ భవన నిర్మాణ పనులను ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అప్పటి వరకు భవన నిర్మాణంపై స్టేటస్ కో కొనసాగించాలని ఆదేశించారు. తదుపరి విచారణను 202, జూలై 7కు వాయిదా వేశారు. దీంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ నూతల కార్యాలయ భవన నిర్మాణానికి బ్రేక్ పడింది.
