న్యూటన్స్ థర్డ్ లా మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్: సుమంత్

న్యూటన్స్ థర్డ్ లా మూవీ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్: సుమంత్

సుమంత్ హీరోగా రాజేశ్ కర్ల దర్శకత్వంలో హరీశ్ నిర్మించిన చిత్రం న్యూటన్స్ థర్డ్ లా. జులై 31న సినిమా విడుదల కానుంది. తాజాగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిధిగా హాజరైన హీరో అడివి శేష్ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా' అని అన్నాడు. సుమంత్ మాట్లాడుతూ.. 'సింగిల్ సిట్టింగ్‎లో ఒకే చేసిన కథ ఇది. ఈ సినిమాలో హీరో స్క్రీన్ప్లేనే, ఇందులో ప్రతి క్యారెక్టర్‎కు ప్రాధాన్యత ఉంది. ప్రతి పాత్రకు కథను మలుపు తిప్పే అవకాశం ఉంటుంది. మంచి థ్రిల్ ఉన్నా, వాటి సెంట్రల్ డ్రామా ఫ్యామిలీ చుట్టూనే ఉంటుంది. 

ఇది ఈటీవీ విన్ ఫ్యామిలీ ఆడియన్స్‎ను కూడా అకట్టుకుంటుంది. రాజేష్ స్టైల్, కథ, స్క్రీన్ ప్లే నాకు చాలా వచ్చాయి. ఈ ట్రైలర్లో చాలా తక్కువ కథనే చెబుతున్నాం. థియేటర్లకు వస్తే చాలా పెద్ద సర్ప్రైజ్ ఉంటుంది" అని చెప్పాడు. ఈ సినిమా తనకు స్పెషల్ అని, ఇందులో చాలా ట్విస్టులు టర్మ్స్ ఉంటాయని హీరోయిన్ నేహా చెప్పింది. 

దర్శకుడు రాజేశ్ కర్ణ మాట్లాడుతూ.. 'ఈ సినిమా ఆడియెన్స్‏కు హయ్యెస్ట్ కిక్ ఇస్తుంది. ఇంటర్వెల్‎కు పైసా వసూల్ ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. థ్రిల్లర్. జానర్‎ను రీడిఫైన్ చేస్తుంది' అని అన్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది అని నిర్మాత హరీష్ అన్నారు.