
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇవ్వాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు షెడ్యూల్ ఇచ్చారు. దీనిపై కొందరు హెడ్మాస్టర్లు బదిలీలు చేసిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు.
అంశాన్ని మంగళవారం విచారిస్తామని, అప్పటి వరకూ ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వొద్దని ఇటీవల ఆదేశాలిచ్చారు. మంగళవారం ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రమోషన్లు, ట్రాన్స్ ఫర్లు రెండూ వేర్వేరు అంశాలనీ, రెండింటినీ కలిపి విచారించలేమని హైకోర్టు చెప్పిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.
ప్రమోషన్ల షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో.. కొనసాగించుకోవచ్చని ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలో కొనసాగుతున్న టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియ కొనసాగనున్నది. బుధవారం హెడ్మాస్టర్ల ప్రమోషన్లకు వెబ్ ఆప్షన్లు ప్రక్రియ కొనసాగనున్నది. 7న ప్రమోషన్ ఆర్డర్లు ఇవ్వనున్నారు.